రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తాం : Revanth Reddy

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-15 07:03:15.0  )
రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తాం : Revanth Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి ఏది చేసినా ప్రజలు నమ్మరని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఓటమి భయంతోనే రుణమాఫీ, నోటిఫికేషన్లు, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తానంటున్నారని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇవాళ గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరుగుతున్నదంటే అది కాంగ్రెస్ వల్లే అని చెప్పారు.

బీఆర్ఎస్ సర్కార్ హడావుడిగా అమ్మిన భూములపై మేం వచ్చాక సమీక్షిస్తామన్నారు. కేసీఆర్ కుటుంబం లక్షకోట్ల అవినీతికి పాల్పడిందని, పది వేల ఎకరాలు దోచుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. గ్యాస్ సిలిండర్, ఇంటి నిర్మాణం, ఆరోగ్యశ్రీ పై రాయితీలు ఇస్తామన్నారు. ‘తిరగబడదాం.. తరిమికొడదాం’ నినాదంతో ప్రజల్లోకి వెళదామని, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొద్దామని శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు స్వాతంత్ర ఫలాలు అందించాలని లక్షలాది కాంగ్రెస్ శ్రేణులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. ఇండియా కూటమి ద్వారానే మళ్లీ దేశానికి మంచి రోజులు వస్తాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed