నిరుద్యోగులకు మరో శుభవార్త.. ఆశా వర్కర్ల నోటిఫికేషన్‌పై హరీష్ రావు కీలక ప్రకటన

by Satheesh |
నిరుద్యోగులకు మరో శుభవార్త.. ఆశా వర్కర్ల నోటిఫికేషన్‌పై హరీష్ రావు కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ మరో శుభవార్త తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1540 అంగన్ వాడీ పోస్టులు ఖాళీ ఉన్నాయని, వాటి భర్తీకి గాను ఈనెలలోనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ఆదివారం అసెంబ్లీలో మంత్రి హరీశ్‌ రావు వెల్లడించారు. మరోవైపు, బస్తీ దవాఖానల్లో త్వరలో బయోమెట్రిక్‌ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు బస్తీదవాఖానల్లో కోటిమంది ప్రజలు సేవలు పొందారని వెల్లడించారు. ఈ మేరకు శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు. పేదల సౌకర్యం కోసం బస్తీ దవాఖానల పని దినాల్లో మార్పు చేస్తామన్నారు.

ఇకపై శనివారం సెలవు ఇస్తున్నామని, ఆదివారం పనిచేయనున్నాయని తెలిపారు. బస్తీ దవాఖానల్లో ఉచితంగా లిపిడ్‌ ప్రొఫైల్‌, థైరాయిడ్‌ వంటి ఖరీదైన పరీక్షలు చేయిస్తున్నట్లు హరీష్ రావు వెల్లడించారు. కాగా, మార్చి నెలాఖరు నాటికి 134 రకాల పరీక్షలు నిర్వహిస్తామన్న ఆయన.. 158 రకాల మందులు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. బస్తీ దవాఖానలతో ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లపై ఓపీ భారం తగ్గిందని తెలిపారు. ఏప్రిల్‌లో అన్ని జిల్లాల్లో న్యూటిషన్‌ కిట్లు పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే మేడ్చల్‌ జిల్లాకు మెడికల్‌ కాలేజీ మంజూరు చేస్తామని...క్రమంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని హరీష్ రావు వెల్లడించారు.

Advertisement

Next Story