- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆన్‌లైన్‌లో టెన్త్ ఫలితాలు
దిశ, న్యూస్బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో టెన్త్ పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులందరినీ పాస్ చేసిన ప్రభుత్వం అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడ్‌లను కేటాయించింది. పదో తరగతిలో నమోదు చేసుకున్న 5,34,903 మంది విద్యార్థులను ఉత్తీర్ణులను చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్నల్ అసెస్ మెంట్ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉండగా, వాటినే వందశాతానికి పెంచారు. విద్యార్థులు 20కి తెచ్చుకున్న మార్కులను 5తో హెచ్చించడం ద్వారా ఆయా సబ్జెక్టుల్లో మార్కులను కేటాయించి ప్రక్రియ పూర్తి చేశారు. విద్యార్థులు గ్రేడ్లను చూసుకునేందుకు www.bse.telangana.gov.inలో సోమవారం మధ్యాహ్నం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. పాస్ మెమోలను సంబంధిత పాఠశాలల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. మెమోల్లో పొరపాట్లు ఉన్నట్టు విద్యార్థులు గుర్తిస్తే ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎస్ఎస్సీ బోర్డును సంప్రదించి సరిచేయించుకోవాలని మంత్రి సూచించారు.