చంద్రబాబుకు అవమానం.. సీఎం జగన్‌పై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

by Shyam |   ( Updated:2021-11-20 05:06:50.0  )
Congress MLA Jaggareddy
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు రాజకీయ వేత్తలు, సామాజిక కార్యకర్తలు స్పందించి వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని వైసీపీ నేతలకు సూచించారు. తాజాగా.. అసెంబ్లీలో చంద్రబాబుకు జరిగిన అవమానంపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించడం సరికాదని, అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం అన్‌ఫిట్ అని విమర్శించారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే, ముఖ్యమంత్రి జగన్‌తో పాటు వైసీపీ నేతల పరిస్థితేంటి అని ప్రశ్నించారు. చంద్రబాబు నన్ను గుర్తుపట్టే పరిచయం కూడా నాకు లేదు, కానీ, ఒక సీనియర్ నాయకుడిని చట్టసభలో అవమానించడం సరికాదని వైసీపీ నేతలకు హితవు పలికారు. చంద్రబాబు వయసుకైనా గౌరవం ఇవ్వాలని సూచించారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని, మా పార్టీకి సంబంధం లేదని అన్నారు.

అత్తకు అవమానం… స్పందించిన జూనియర్ NTR (వీడియో)… కుటుంబసభ్యుడిగా కాదు మరోలా చెప్తున్నా అంటూ వార్నింగ్..

epaper – 1:00 PM TS EDITION (20-11-21) చదవండి

Advertisement

Next Story