కల్లు కుండ ఖతం బట్టిచ్చిన మంత్రులు..

by Shyam |
కల్లు కుండ ఖతం బట్టిచ్చిన మంత్రులు..
X

దిశ, వెబ్‌డెస్క్: జనగామ జిల్లా రామవరం గ్రామంలో శుక్రవారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్‌లు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో పర్యటనలో భాగంగా తాటివనంలో గీత కార్మికుడి వద్ద ఇద్దరు మంత్రులు తాటి కమ్మలో కల్లు తాగారు. ముందుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తాగుతుండగా.. మొత్తం కల్లు తాగేస్తారని మంత్రి ఎర్రబెల్లి సెటైర్లు వేశారు. ఈ క్రమంలో ఇరువురూ జోకులు వేస్తూ నవ్వులు పూయించారు. దీనికి సంబంధించిన వీడియో ఉంది చూడొచ్చు.

Advertisement

Next Story