బిగ్ బ్రేకింగ్: ఈటల శాఖ సీఎంకి… గవర్నర్ సంచలన నిర్ణయం

by Anukaran |   ( Updated:2021-05-01 03:34:42.0  )
బిగ్ బ్రేకింగ్: ఈటల శాఖ సీఎంకి… గవర్నర్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. ఈటల వ్యవహారంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈటల రాజేందర్ ను వైద్యఆరోగ్య శాఖ నుండి తప్పించాలని సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన గవర్నర్.. వైద్య ఆరోగ్యశాఖను సీఎంకు బదలాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు అధికారిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ సీఎం పరిధిలోకి వెళ్లడంతోపాటు ఈటల రాజేందర్ ఏ శాఖ లేని మంత్రిగా మిగిలారు.

Advertisement

Next Story