రైతులకు గుడ్ న్యూస్ : రైతుబంధుపై సర్కార్ కీలక ప్రకటన

by Anukaran |   ( Updated:2021-12-18 01:56:57.0  )
రైతులకు గుడ్ న్యూస్ : రైతుబంధుపై సర్కార్ కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతీ సీజన్‌లో ప్రభుత్వం విడుదల చేసే రైతుబంధు సాయం కోసం కొత్తగా వ్యవసాయంలోకి వచ్చిన రైతుల నుంచి దరఖాస్తులను కోరడం ఆనవాయితీ. ఇప్పుడు యాసంగి సీజన్‌కు సంబంధించిన నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో భాగంగా కొత్త రైతుల నుంచి దరఖాస్తులను వ్యవసాయ శాఖ ఆహ్వానిస్తున్నది.

ఈ నెల 10వ తేదీని కటాఫ్ డేట్‌గా పెట్టుకుని అప్పటివరకు ధరణిలో సాగుభూముల వివరాలు నమోదై కొత్తగా పట్టాదారు పాస్ బుక్కులు పొందిన రైతులు ఈ సాయాన్ని పొందడానికి అర్హులని తెలిపారు. ప్రతీ సీజన్‌కు లబ్ధిదారులుగా ఉన్న రైతులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా రైతులైనవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను స్థానికంగా ఉన్న వ్యవసాయ శాఖ విస్తరణాధికారుల (ఏఈఓ)లకు అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు పట్టాదారు పాసు పుస్తకం నకలు ప్రతిని లేదా తహసీల్దారు డిటిటల్ సంతకం అయిన పత్రాన్ని, ఆధార్ కార్డు జిరాక్సు కాపీని, బ్యాంకు ఖాతా పాస్ బుక్కు జిరాక్సును సమర్పించాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ పేర్కొన్నది.

Advertisement

Next Story