అభివృద్ధి నిధులు వారి చేతుల్లోనే.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

by Anukaran |
అభివృద్ధి నిధులు వారి చేతుల్లోనే.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన ఐదు కోట్ల రూపాయలను ఏయే అవసరాలకు ఖర్చు చేయాలో ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ఎమ్మెల్సీలు, నామినేటెడ్ ఎమ్మెల్యలేకు ఆ పథకం ద్వారా లభించే నిధులను ఏ అవసరాల కోసం ఎలా ఖర్చు చేయాలో ఆయా జిల్లాల/నియోజకవర్గాల మంత్రులకు బాధ్యతలు అప్పజెప్తూ రాష్ట్ర ప్లానింగ్ శాఖ స్పష్టత ఇచ్చింది. పది మంది మంత్రులకు పన్నెండు మంది ఎమ్మెల్సీలను, ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేలకు కేటాయించిన నిధులను ఖర్చు చేయడానికి పర్యవేక్షణ బాధ్యతలను అప్పజెప్పింది. హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి తదితర పది మంది మంత్రులకు ఈ బాధ్యతలను అప్పజెప్పింది.

మంత్రి సత్యవతి రాథోడ్‌కు డోర్నకల్, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు స్వయంగా ఆమె ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులను ఖర్చు చేసే బాధ్యతలను అప్పగించింది. ఆ ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఖర్చు చేయడానికి నిర్దిష్టంగా ఏయే పనికి ఎంత మొత్తంలో కేటాయించాలనేదానిపై మంత్రులు తెలిపే ఆమోదం ప్రకారం జిల్లా కలెక్టర్ ఆ పనుల ప్రతిపాదనలను ఖరారు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed