- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మళ్లీ కరోనా కలకలం.. చర్యలకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం
దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా కొత్త వేరియంట్(ఒమిక్రాన్) పై అప్రమత్తమైన కేంద్రం తగు జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా శనివారం ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు కొనసాగించాలని మోడీ సూచించారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. ఇక కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్ర సర్కార్.. కరోనా రెండు డోసులు వేసుకున్నవారికే అనుమతిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి అని నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రేపు వైద్యారోగ్య శాఖ అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తోన్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.