గుజరాత్‌లో ప్రమాదం.. తెలంగాణ ఉద్యోగులు మృతి

by Shyam |
గుజరాత్‌లో ప్రమాదం.. తెలంగాణ ఉద్యోగులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హైదరాబాద్ అడిక్‌మెట్ ఆంజనేయస్వామి ఆలయ ఈవో శ్రీనివాస్, పాన్‌బజార్ వేణుగోపాల స్వామి ఆలయ జూనియర్ అసిస్టెంట్ రమణ మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా అక్కడ స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉత్తరాదీ జలాల కోసం గుజరాత్ వెళ్లగా వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మృతుల కుటుంబాలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

Next Story