ఆగస్టులోనే ఎంసెట్ ఎగ్జామ్స్!

by Shyam |
ఆగస్టులోనే ఎంసెట్ ఎగ్జామ్స్!
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి దెబ్బకు రాష్ట్రంలో ఇప్పటికి వరకు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా కంట్రోల్ అయ్యాక పరీక్షలు నిర్వహించాలని అనుకున్నారు. అందులో ఎంసెట్ కూడా ఉన్నది. అయితే దానికి సంబంధించిన ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ఆగస్టు నెలలోనే నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణ సంస్థ టీసీఎస్‌ స్లాట్స్‌ సెప్టెంబర్‌ నెలలో లేనందున, ఆగస్టులోనే ఖాళీ తేదీల్లో నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది. అయితే ఈనెలలోనే ఈసెట్, ఎంసెట్‌ సహా అన్ని సెట్స్‌ను నిర్వహించాల్సి ఉన్నా.. కోర్టు కేసు కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది.

ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నుంచి వీటిని నిర్వహించేలా షెడ్యూలు ఖరారు చేసేందుకు కసరత్తు మొదలైంది. దీనిపై అడ్వకేట్‌ జనరల్‌తో చర్చించి హైకోర్టుకు తెలియజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలని నిర్ణయించారు. కోర్టు ఆమోదం లభించగానే షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story