- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా.. ఢిల్లీ మర్కజ్ మసీదు టు తెలంగాణ
దిశ, న్యూస్ బ్యూరో: కరీంనగర్‌లో పర్యటించిన ఇండోనేషియా పౌరులకు పాజిటివ్ ఎలా వచ్చింది? హైదరాబాద్‌లోని ఒకే కుటుంబంలో ఐదుగురు కరోనాకు ఎలా గురయ్యారు? నగరంలోని మరో కుటుంబంలో ముగ్గురికి ఎలా సోకింది? వీరందరికీ ఎలాంటి సంబంధం లేకుండా ఎందుకు సోకినట్లు? లోతుల్లోకి వెళ్ళి చూస్తే వీరందరికీ ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కస్ మసీదుతో సంబంధం ఉన్నట్లు తేలింది. వీరందరికీ మసీదు ద్వారానే కరోనా అంటుకుందా? ఇప్పుడు రాష్ట్ర వైద్యశాఖ అధికారులను పట్టి పీడిస్తున్న అంశం ఇదే. వివరాల్లోకి వెళ్తే…
రాష్ట్రంలో పాజిటివ్‌గా తేలిన మొత్తం 59 కేసుల్లో 19 కేసులకు ఢిల్లీలోని మర్కజ్ మసీదుతో మూలాలు ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టతకు వచ్చింది. మత ప్రచారం కోసం కరీంనగర్‌కు వచ్చిన పది మంది ఇండోనేషియా పౌరులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ప్రస్తుతం చికిత్సలో ఉన్నారు. వారితో సంబంధాల్లోకి వెళ్ళిన స్థానికుడొకరికి కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరు కరీంనగర్‌కు రావడానికి ముందు ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన తర్వాత నిజాముద్దీన్‌లోని మర్కజ్ మసీదులో ప్రార్థనలు చేసినట్లు రాష్ట్ర పోలీసు, వైద్యాధికారుల విచారణలో తేలింది. ఇదే మసీదులో ప్రార్థన చేసిన హైదరాబాద్ నగరానికి చెందిన ఒకరికి, ఆయన కుటుంబంలోని మరో నలుగురికి కూడా పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. ఇదే మసీదులో ప్రార్థనలు చేసిన హైదరాబాద్ నగరానికి చెందిన ఒకరికి, ఆయన కుటుంబంలోని మరో ఇద్దరికి కూడా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో మసీదుతో సంబంధం ఉన్న మొత్తం 19 మందికి పాజిటివ్ రిపోర్టు రావడంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు విస్తుపోయారు.
మసీదు నుంచి వైరస్‌ను వీరు ఇక్కడకు మోసుకొచ్చారేమో అనే సందేహాలు రాష్ట్ర వైద్యశాఖ అధికారులను వెంటాడుతున్నాయి. నిజానికి ఇండోనేషియా బృందానికి, హైదరాబాద్‌లో పాజిటివ్ వచ్చిన వ్యక్తికి లేదా ఆ కుటుంబంలో పాజిటివ్‌గా తేలిన నలుగురికీ ఎలాంటి సంబంధాలు లేవు. అదే విధంగా నగరంలోని మరో పాజిటివ్ వ్యక్తికి, ఆయన కుటుంబంలో పాజిటివ్‌గా ఉన్న ఇద్దరు వ్యక్తులకు కూడా సంబంధం లేదు. కానీ వీరందరికీ నిజాముద్దీన్‌లోని మర్కజ్ మసీదు మాత్రం ఉమ్మడిగా నిలిచింది. ఇండోనేషియా బృందంలోని పదిమందికీ పాజిటివ్ అని తేలడంతో ఉలిక్కిపడిన రాష్ట్ర ప్రభుత్వం వారు ఢిల్లీ నుంచి వచ్చినందున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి వీరితో పాటు ఢిల్లీలో ఉండిపోయిన ఇండోనేషియా పౌరులకు పరీక్షలు నిర్వహించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది.
కరీంనగర్‌లో పర్యటించిన పది మంది ఇండోనేషియా పౌరులకు పాజిటివ్ అని తేలినప్పుడే మర్కజ్ మసీదు విషయం అధికారుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత రాష్ట్రంలో ఒకే కుటుంబంలో ఐదుగురికి, మరో కుటుంబంలో ముగ్గురికి పాజిటివ్ అని తేలిన తర్వాత జరిపిన ‘ట్రావెల్ హిస్టరీ’ దర్యాప్తులో మర్కజ్ మసీదు ప్రస్తావన రావడంతో ఆ మసీదుపై తెలంగాణ అధికారులకు అనుమానం కలిగింది. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి మసీదులోకి రావడంతో వారి ద్వారా ఇండోనేషియా బృందానికి కూడా అంటుకుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిజానికి ఇండోనేషియా నుంచి వారు విమానం దిగిన సమయంలో జరిపిన స్క్రీనింగ్ టెస్ట్‌లో కరోనా లక్షణాలేవీ బైటపడలేదు. పాజిటివ్ అనే నిర్ధారణకు ఆస్కారమే లేదు. కానీ వారు కరీంనగర్ వచ్చిన తర్వాత మాత్రమే బైటపడింది.
ఇదే సమయంలో ఇండోనేషియా బృందంతో ఎలాంటి సంబంధం లేని హైదరాబాద్ నగరానికి చెందిన ఒక వ్యక్తికి పాజిటివ్ రావడం, అతని ద్వారా కుటుంబంలోని నలుగురికి అంటుకోవడం వారం రోజుల క్రితం సంచలనం రేకెత్తించింది. అతని ట్రావెల్ హిస్టరీని తెలుసుకుంటున్న సమయంలో మర్కజ్ మసీదు గురించి వివరాలు వెలుగులోకి రావడం, అప్పటికే ఆ మసీదు గురించి ఇండోనేషియా పౌరులు చెప్పడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆశ్చర్యం కలిగింది. ఆ తర్వాత నగరంలోని మరో కుటుంబంలో ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారి ట్రావెల్ హిస్టరీలో కూడా మర్కజ్ మసీదును సందర్శించినట్లు తెలిసింది. దీంతో ఒక్క మసీదు పర్యటనతో రాష్ట్రంలోని మొత్తం 59 కేసుల్లో 19 కేసులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉంది.
రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళనలో ఉన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు 19 కేసులతో మర్కజ్ మసీదు ఉమ్మడి కేంద్రంగా ఉండడం ఆశ్చర్యం కలిగించింది. తెలంగాణకు సంబంధించిన ఆందోళనే ఈ స్థాయిలో ఉంటే ఇక ఆ మసీదులో ప్రార్థనలు చేసిన ఇతరులు, ఢిల్లీ స్థానికుల్లో ఎంతమందికి పాజిటివ్ నిర్ధారణ అయిందో అనే అనుమానం ఇప్పుడు రాష్ట్ర అధికారులను కలవరానికి గురిచేస్తోంది. మసీదు ద్వారా 19 మందికి పాజిటివ్ సోకడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.