- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు సీఎం కేసీఆర్ భారీ గుడ్ న్యూస్.. రూ.50 వేలు జమ
దిశ, తెలంగాణ బ్యూరో: రుణమాఫీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆగస్టు 15వ తేదీ నుంచి నెలాఖరులోగా రూ. 50 వేల లోపు రుణం ఉన్న రైతులందరికీ రుణమాఫీ పథకాన్ని అమలుచేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటివరకు రెండేళ్లలో రూ. 25 వేల లోపు రుణం ఉన్న రైతులకు మాత్రమే మాఫీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ పరిమితిని రూ. 50 వేలకు పెంచి పంద్రాగస్టు నుంచి అమలు చేయనున్నట్లు తెలిపింది. దీని ద్వారా సుమారు ఆరు లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలవారీగా ఈ పరిధిలోకి వచ్చే రైతుల రుణాలు ఏ స్థాయిలో ఉన్నాయో, దానికి ఎంత అవసరమవుతుందో వ్యవసాయ, ఆర్థిక శాఖలు లెక్కలు వేసి నిర్దిష్టంగా తేల్చనున్నాయి.
రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో రుణమాఫీ అమలు గురించి ఆర్థిక శాఖ పూర్తి వివరాలను కేబినెట్ ముందు ఉంచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఆదివారం జరిగిన కేబినెట్ భేటీ ఈ అంశాన్ని చర్చించింది. దీనితో పాటు వ్యవసాయ రంగంపైనా లోతుగా చర్చించి పత్తికి అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న డిమాండును దృష్టిలో పెట్టుకుని సాగును మరింతగా పెంచాలని నిర్ణయించింది. ఆ దిశగా రైతాంగానికి అవగాహన కల్పించడంతో పాటు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖను మంత్రివర్గం ఆదేశించింది. వర్షాలు, పంటల సాగు, ఇరిగేషన్ నీటి సౌకర్య, ఎరువుల లభ్యత-కొరత తదితరాలపై కూడా ఈ సమావేశంలో చర్చించి తగిన చొరవ తీసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది.