- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాంబిరెడ్డితో హీరోగా ఎంట్రీ ఇస్తున్న ‘తేజ’
టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా గుర్తుండే ఉంటాడు. ఇటీవలే ‘ఓ బేబీ’ చిత్రంలో.. యువతను రిప్రజెంట్ చేసే పాత్రతో అందర్నీ మెప్పించాడు ఈ యువ నటుడు. ప్రస్తుతం ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జాంబిరెడ్డి’ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు.
మంచి దర్శకత్వ ప్రతిభ ఉన్న ప్రశాంత్.. తన మూడో సినిమాగా కరోనా వైరస్ నేపథ్యంలో ‘జాంబి రెడ్డి’ అనే టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. ఇది తెలుగులో రూపొందుతున్న ఫస్ట్ జాంబి సినిమా అని చెప్తూ ఇటీవల టైటిల్ లోగో కూడా రిలీజ్ చేశారు. అయితే, హీరో ఎవరనే విషయాన్ని ఆ టైమ్‌లో రివీల్ చేయలేదు. కాగా, నిన్న చిరంజీవి బర్త్ డే సందర్భంగా.. హీరో ఫేస్ రివీల్ చేయకుండా, ఆయన వెనక షర్ట్‌పై చిరు ఫొటోతో ఓ మోషన్ పోస్టర్ విడుదల చేశాడు. దీనికి బీజీఎంగా చిరంజీవి సూపర్ హిట్ ఫిల్మ్ ‘దొంగ’లోని పాపులర్ సాంగ్ ‘కాష్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావో’ మ్యూజిక్‌ను ఉపయోగించారు. ఇక హీరో ఎవరన్నది ఆదివారం ప్రకటిస్తామని చిత్ర బృందం తెలియజేసింది. కాగా, నేడు తేజ పుట్టినరోజు సందర్భంగా అతని ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తూ చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలియజేసింది.
ఇదేగాక, తేజ మరో సినిమాలోనూ హీరోగా చేశాడు. మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై చంద్ర శేఖర్ మొగుల్ల, ఎస్.ఒరిజినల్స్ సృజన్ యరబోలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తేజ పుట్టిన రోజు సందర్భంగా తేజ్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్. శివానీ రాజశేఖర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఫాంటసీ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.