KTR : మార్పు ప్రగల్భాలు..కక్ష సాధింపు పనులు : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |
KTR : మార్పు ప్రగల్భాలు..కక్ష సాధింపు పనులు : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : మార్పు అని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) కక్ష సాధింపు పనుల్లో బిజీగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)ఎక్స్ వేదికగా విమర్శించారు. సిరిసిల్ల చేనేత కార్మికుడి బలవన్మరణంపై ఆయన స్పందిస్తూ సర్కారు చేతిలో మరో నేతన్న బలయ్యారంటూ ఆరోపించారు. జీవన పోరాటం ఇక నావల్ల కాదు అని దూస గణేష్ తన ఇద్దరు ఆడపిల్లలను అనాథలను చేసి వెళ్లిపోయాడని, సంవత్సర కాలంగా సాంచాలు సరిగా నడవకపోవడం వలన, ఉపాధి లేక, పని దొరకపోవడంతో అప్పులు తీర్చలేక వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.

సిరిసిల్లను మళ్లీ ఉరిసిల్లగా మారుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి..వినిపిస్తున్నాయా ఆ చిన్నారుల ఆర్తనాధాలు? అని ప్రశ్నించారు. మార్పు అని ప్రగల్భాలు పలికిన నువ్వు వెళ్లి చెప్పు ఆ కూతుళ్లకు..ప్రభుత్వం కక్షసాధింపుల్లో క్షణం తీరికలేకుండా ఉందని..నేతన్నలైనా, రైతన్నలైనా తమ బిడ్డలను అనాథలుగా వదిలి వెళ్ళాల్సిందేనని విమర్శించారు. మరణవాంగ్మూలాలు, అప్పుల చిట్టాలే...వారి బిడ్డలకి దక్కే ఆస్తులు అని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed