ధరణిని కనిపెట్టింది కేసీఆర్ కాదు.. అసెంబ్లీలో CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
ధరణిని కనిపెట్టింది కేసీఆర్ కాదు.. అసెంబ్లీలో CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సీరియస్ అయ్యారు. శుక్రవారం అసెంబ్లీ(Assembly)లో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షం సహనం కోల్పోయింది.. బీఆర్‌ఎస్‌ సభ్యులు(BRS MLAs) అహంభావంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. మర్యాద లేకుండా స్పీకర్‌పైనే పేపర్లు విసిరేశారని మండిపడ్డారు. చర్యలు తీసుకునే పరిస్థితులు వచ్చినా స్పీకర్(Telangana Speaker) ఓపికతో వ్యవహరించారని అన్నారు. భూముల కోసం ఎంతో మంది యోధులు త్యాగాలు చేశారు. అధికారం, అహంకారంతో కొంతమంది ఆధిపత్యం కోసం దాడులు చేశారు. భూమి కోసం, భుక్తి కోసం సాయుధ పోరాటం చేశారని గుర్తుచేశారు. భూమి కోసం సకల జనులు పోరాడిన సందర్భాలు ఉన్నాయి.

చట్టాలతో యజమానుల హక్కులను కాపాడుకుంటూ వస్తున్నట్లు ప్రకటించారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌ను పీవీ నరసింహా రావు తీసుకొచ్చారు. ఇందిరా హయాంలో అసైన్‌మెంట్ భూముల పంపిణీ జరిగింది. యూపీఏ హయాంలోనే భూభారతి పేరుతో దేశవ్యాప్తంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు గుర్తుచేశారు. నిజామాబాద్‌లో పైలెట్ ప్రాజెక్ట్‌ శ్రీకారం చుట్టారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో ధరణిని పూర్తిగా తప్పుబడుతూ 2014లో కాగ్ రిపోర్ట్ ఇచ్చిందని.. కాగా తప్పుబట్టినా తెలంగాణపై ధరణిని ఎందుకు రుద్దారని ప్రశ్నించారు. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ ధరణిని తీసుకొచ్చారు. సాంకేతిక అద్భుతం అంటూ ధరణి గురించి గొప్పలు చెప్పారని విమర్శించారు. అసలు ధరణిని ముందు కనిపెట్టింది కేసీఆర్ కాదు.. 2010లోనే ఒరిస్సాలో ఈ-ధరణి తీసుకొచ్చారని తెలిపారు.

Advertisement

Next Story