- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bajaj Chetak EV: బజాజ్ నుంచి కొత్త చేతక్ ఈవీ లాంచ్.. ధర ఎంతంటే..!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ బజాజ్(Bajaj) క్లాసిక్ లుక్(Classic Look)తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్(E-Scooter)ను శుక్రవారం లాంచ్ చేసింది. తన చేతక్ 35 సిరీస్ లో 3501, 3502 పేరుతో రెండు వేరియంట్ లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. చేతక్ 3501 వేరియంట్ ధరను కంపెనీ రూ. 1,27,000గా, 3502 మోడల్ ధరను 1,20,000గా నిర్ణయించింది. అలాగే త్వరలో 3503 వేరియంట్ కూడా లాంచ్ చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. ఇక స్పెసిఫికేషన్ల(Specifications) విషయానికొస్తే.. ఇందులో 3.5 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్, 4 కిలో వాట్స్ మోటార్ అమర్చారు. ఇది గరిష్టంగా గంటకు 73 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో వెళ్తుంది. దీని బ్యాటరీని ఫుల్ చేయడానికి దాదాపు మూడు గంటల సమయం పడుతుందని, ఒక్క ఫుల్ ఛార్జ్ తో ఇది 153 కిలో మీటర్ల వరకు ట్రావెల్ చేయగలదని కంపెనీ చెబుతోంది. మరోవైపు ఈ స్కూటర్ లో మ్యూజిక్ కంట్రోల్, 5 ఇంచెస్ టచ్ TFT డిస్ ప్లే, కాలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఓవర్ స్పీడ్ అలర్ట్, థెఫ్ట్ అలర్ట్, జియో ఫెన్స్, యాక్సిడెంట్ డిటెక్షన్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఇందులో ఇచ్చారు. ఈ బైక్ టీవీఎస్ ఐక్యూబ్(TVS iqube), ఓలా ఎస్1(Ola S1), ఏథర్ రిజ్త(Ather Rizta) వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.