Kalyan Ram: కల్యాణ్ రామ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ యాక్టర్.. పోస్టర్ రిలీజ్

by sudharani |
Kalyan Ram: కల్యాణ్ రామ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ యాక్టర్.. పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: నందమూరి కల్యాణ్ రామ్ (Kalyan Ram) ప్రజెంట్ హీరోగా, నిర్మాతగా వ్యవహరిస్తున్న కెరీర్‌లో దూసుకుపోతున్నారు. ‘బింబిసార’ (Bimbisara)చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈయన ప్రస్తుతం ‘NKR21’ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీతో బాలీవుడ్ (Bollywood) యాక్టర్ సోహైల్ ఖాన్ (Sohail Khan) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ‘NKR21’లో సోహైల్ కీలక పాత్ర పోషించనున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ.. ఆయన బర్త్‌డే సందర్భంగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం.

ఈ పోస్టర్‌లో సోహైల్ ఖాన్ సూపర్ స్టైలిష్‌ (super stylish)గా అండ్ సీరియస్‌గా కనిపిస్తుండగా.. ఇంతకీ ‘NKR21’ లో అతని పాత్ర ఏంటీ అనేది మాత్రం రివీల్ చేయలేదు. ప్రజెంట్ ఈ పోస్టర్ (poster) ఆసక్తికరంగా ఆకట్టుకుంటోంది. కాగా డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilkuri) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ (Sai Manjrekar) హీరోయిన్‌గా నటిస్తుండగా సీనియర్ హీరోయిన్ విజయశాంతి (Vijayashanti) ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించనుంది. అశోక క్రియేషన్స్ బ్యానర్‌లో అశోక్ వర్ధన్ ముప్ప, సునిల్ బలుసు, ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

Next Story

Most Viewed