Sai Pallavi : ఉత్తమ నటిగా సాయి పల్లవి, నటుడిగా విజయ్ సేతుపతి

by M.Rajitha |
Sai Pallavi : ఉత్తమ నటిగా సాయి పల్లవి, నటుడిగా విజయ్ సేతుపతి
X

దిశ, వెబ్ డెస్క్ : చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(Chennai International Film Festival) లో ఉత్తమ నటిగా సాయి పల్లవి(Sai Pallavi), ఉత్తమ నటుడిగా విజయ్ సేతుపతి(Vijay Sethupathi) అవార్డులు అందుకున్నారు. చెన్నైలో గురువారం సాయంత్రం జరిగిన ఈ వేడుకల్లో కోలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. 'అమరన్' చిత్రంలో నటనకు గాను సాయి పల్లవి బెస్ట్ ఆక్ట్రెస్ గా, 'మహారాజ' చిత్రంలో నటనకు గాను విజయ్ సేతుపతి బెస్ట్ ఆక్టర్ గా అవార్డులు అందుకున్నారు. అలాగే ఉత్తమ చిత్రంగా అమరన్, ఉత్తమ బాలనటుడు పోన్వెల్(వాళై), ఉత్తమ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్(అమరన్), స్పెషల్ జ్యూరీ అవార్డు మారి సెల్వరాజ్(వాళై), పా.రంజిత్(తంగాలన్) ఉత్తమ ఎడిటర్ ఫీలోమిన్ రాజ్(అమరన్) మొదలకు విభాగాల్లో విజేతలు అవార్డులు అందుకున్నారు.

Advertisement

Next Story