- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మన్యం జిల్లాలో ప్రతికూల వాతావరణం.. లెక్కచేయకుండా పవన్ పర్యటన
దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Ap Deputy Cm Pawan Kalyan) పార్వతీపురం మన్యం జిల్లా(Parvathipuram Manyam District)లో ఈ రోజు పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే విశాఖ(Visakha)కు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే మన్యం జిల్లా పర్యటనకు ఆయన అక్కడి నుంచి బయల్దేరారు. అయితే వాతారవరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని పవన్‌కు అధికారులు తెలిపారు. దీంతో వాతావరణ పరిస్థితులు ఎలాగున్నా సరే పర్యటన చేయాల్సిందేనని అధికారులకు చెప్పారు. ఈ మేరకు మన్యం జిల్లా పర్యటనకు అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. దీంతో ఆయన విశాఖ నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు రోడ్డు మార్గాన బయల్దేరారు.
ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆయన పర్యటన కొనసాగనుంది. తొలుత సాలూరు నియోజకవర్గం పనసభద్ర పంచాయతీ బాగుజోలకు పవన్ వెళ్తున్నారు. ఆ తర్వాత గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి పవన్ శంకుస్థాపనలు చేయనున్నారు. దాదాపు 36.71 కోట్ల వ్యయంతో 39.32 కి.మీ. మేర నూతన రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రోడ్ల నిర్మాణంతో 55 గిరిజన గ్రామాలకు చెందిన 3782 మందికి డొలీల బాధల నుండి విముక్తి కల్పించనున్నారు.