Pavan Kalyan : పార్వతీపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్

by M.Rajitha |
Pavan Kalyan : పార్వతీపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్ : పార్వతీపురం(Parvathipuram) మన్యం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Deputy CM Pavan Kalyan) శుక్రవారం పర్యటించారు. మక్కువ మండలం బాగుజోలలో రూ.9 కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గిరిజన యువతకు ఉపాధి, తాగునీరు, సరైన రోడ్లు ఇంతవరకూ లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. 'మన్యం వంటి వెనుకబడ్డ ప్రాంతాల కోసం రూ.670 కోట్లు వస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదు.. కాని రుషికొండ(Rushikonda)కు రూ.500 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక్కడ రూ.9 కోట్లతో రోడ్లు వేయలేకపోయారు' అని మండిపడ్డారు. గిరిజన యువతకు పర్యాటక రంగంలో ఉపాధి కల్పిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇకపై ప్రతి 2 నెలల్లో మూడు రోజులు మన్యంలో పర్యటిస్తానని, గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసేదాక విశ్రమించేది లేదని పేర్కొన్నారు. అంతకముందు ప్రధాన మార్గం నుంచి బాగుజోల గ్రామానికి నడిచి వెళ్లిన పవన్‌.. గిరిజనుల కష్టాలను స్వయంగా చూసి తెలుసుకొని ఆవేదన చెందారు.

Advertisement

Next Story