Sim Cards: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసా? ఇలా చెక్ చేసుకోండి

by Maddikunta Saikiran |
Sim Cards: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసా? ఇలా చెక్ చేసుకోండి
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లో ఇటీవల కాలంలో సిమ్ కార్డుల(Sim Cards) వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. మనలో చాలామంది తరచూ కొత్త సిమ్ కార్డులను కొంటూ ఉంటారు. కొన్ని రోజులు వాడిన తరువాత వాటిని పడేస్తారు. మళ్లీ కొత్తవి తీసుకుంటారు. అలాగే తమ ఆధార్ కార్డు(Aadhar Card)పై ఎన్ని సిమ్ కార్డులు తీసుకున్నామో కూడా కొందరికి గుర్తుండదు. కాగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(DOT) రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి తమ ఆధార్ కార్డుపై కేవలం 9 సిమ్(9 Sims)లు మాత్రమే తీసుకోవచ్చు. ఒకే ఆధార్ కార్డుపై తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ కార్డులు తీసుకుంటే రూ. 50 వేల ఫైన్ విధిస్తారు. ఈ నేపథ్యంలో మన ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఇలా తెలుసుకోండి..

  • తమ పేరుపై ఉన్న సిమ్ కార్డుల డీటెయిల్స్ తెలుసుకోవడానికి ముందుగా మనం సంచార్ సాతి వెబ్‌సైట్‌ https://sancharsaathi.gov.in/ లోకి వెళ్లాలి.
  • అక్కడ 'Know Your Mobile Connections' పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మన 10 డిజిట్ మొబైల్‌ నంబర్‌, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. మొబైల్‌కు ఓటీపీ వచ్చాక దాన్ని ఎంటర్ చేయాలి.
  • ఓటీపీ నమోదు చేశాక.. మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో చూయిస్తుంది.
  • ఒకవేళ ఆ నంబర్‌ మీది కాకపోయినా.. మీకు సంబంధం లేని నంబర్లు మీ పేరుపై ఉన్న వాటిని రద్దు చేసుకోవచ్చు.
Advertisement

Next Story

Most Viewed