- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చదువుకున్న పాఠశాలను మరవద్దు
దిశ,నేలకొండపల్లి :మనం చదువుకున్న పాఠశాలను ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని సింగారెడ్డి పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమయం కేటాయించాలన్నారు.
పాఠశాలకు ప్రతి విద్యార్థి హాజరయ్యే విధంగా ఉపాధ్యాయులు చూసుకోవాలని సూచించారు. ప్రతి పాఠశాలలో నాణ్యమైన విద్యను ఉపాధ్యాయులు అందించాలన్నారు. ఖాళీగా ఉన్న పాఠశాలలో టీచర్లను నియమించామని ఆయన తెలిపారు. విద్యతో సమాజాన్ని అర్థం చేసుకోవడంతో పాటు ఉద్యోగం చేసేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా పాఠశాలకు వచ్చి వారి పిల్లలు ఏ విధంగా చదువుతున్నారో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, ఎమ్మార్వో, ఎంపీడీఓ, ఎంఈఓ, ఏఓ, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఏపీఓ, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.