Honda Cars: ధరలు పెంచిన హోండా కార్స్

by S Gopi |
Honda Cars: ధరలు పెంచిన హోండా కార్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ వాహన పరిశ్రమలో ధరల పెంపు ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా తన పోర్ట్‌ఫోలియోలోని అన్ని కార్ల ధరలను పెంచుతున్నట్టు శుక్రవారం ప్రకటించింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని కొంత ఆర్థిక భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నామని కంపెనీ తెలిపింది. అన్ని మోడళ్లపై 2 శాతం వరకు పెంపు నిర్ణయం తీసుకోగా, సవరించిన ధరలు కొత్త ఏడాదిలో జనవరి నుంచి అమల్లో వస్తాయని వివరించింది. ప్రధానంగా కార్ల తయారీలో ఖర్చులు పెరిగాయని, ద్రవ్యోల్బణ ప్రభావంతో కీలకమైన పరికరాలు ఖరీదైన నేపథ్యంలో పెంపు నిర్ణయం తీసుకోక తప్పలేదని హోండా కార్స్ ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెల్ చెప్పారు. ముఖ్యంగా ఇన్‌పుట్ ఖర్చులకు తోడు లాజిస్టిక్స్ వ్యయం కంపెనీకి భారంగా మారింది. ఇన్‌పుట్ ఖర్చులను నియంత్రించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేశామని, దానివల్లే కస్టమర్లపై తక్కువ ప్రభావం ఉండేలా చూసుకున్నామని కునాల్ అన్నారు. కాగా, ఇప్పటికే వాహన పరిశ్రమలో మారుతీ సుజుకి మొదలుకొని హ్యూండాయ్, టాటా మోటార్స్ వంటి కంపెనీలు కొత్త ఏడాది నుంచి ధరలు పెంచుతున్నట్టు ప్రకటించాయి.

Advertisement

Next Story

Most Viewed