- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Assembly: ఫార్ములా-ఈరేస్‌పై చర్చకు సిద్ధం.. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ సంచలనం విషయాలు
దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా-ఈ రేసు(Formula-E race) వ్యవహారంలో చర్చకు తాము సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఎఫ్-1 రేసు విషయంలో చర్చించేందుకు అవసరమైతే బీఆర్ఎస్ ఆఫీసుకు వెళ్లేందుకు కూడా తాము సిద్ధమని ప్రకటించారు. ఈ కార్ రేసింగ్ గురించి సభలో చర్చించాలని కేటీఆర్(KTR) ఇన్నాళ్లు ఎందుకు అడగలేదని అన్నారు. ప్రస్తుతం ఈ అంశంపై విచారణ జరుగుతోందని కాబట్టి తాను ఎక్కువ మాట్లాడలేనని అన్నారు.
హెచ్‌ఎండీఏ(HMDA) ఖాతాలోని కోట్ల నిధులు నేరుగా లండన్(London)లోని కంపెనీకి ఎలా వెళ్లాయని ప్రశ్నించారు. నిర్వహకులతో కేటీఆర్ కుదుర్చుకున్న ఒప్పందం విలువ రూ.600 అని.. మిగతా డబ్బుల కోసం వాళ్లు నా వద్దకు వచ్చినప్పుడే ఈ విషయం తెలిసిందని అన్నారు. ఫార్ములా-ఈరేస్ ప్రతినిధులు తనను కూడా కలిశారని.. రూ.600 కోట్ల పెండింగ్ నిధులు రావాల్సి ఉంది.. ఇవ్వాలని అడిగారు. మీరు ఊ అంటే రేసింగ్ మరోసారి రేసింగ్ నిర్వహిస్తామని అన్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. నన్ను కలిసిన సందర్భంలో నాతో ఫొటో దిగారని అన్నారు. ఆరోజే కేటీఆర్‌తో చీకటి ఒప్పందం ఉందని కూడా చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మీరు కూడా సహకరించాలని నన్ను కోరారు.. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని చేసిన ప్రయత్నంలో అసలు స్కామ్ బయటపడిందని అన్నారు. తప్పు చేసి కూడా దబాయిస్తున్నారని సీరియస్ అయ్యారు. వందలకోట్లు విదేశాలకు తరలిస్తుంటే విచారణ జరపొద్దా? అని అడిగారు. ఔటర్ రింగ్ రోడ్లు అమ్ముకుంటే పరిశీలించొద్దా? అని ప్రశ్నించారు. ఒప్పందాలు రద్దు చేయాలని అంటున్నారు. రద్దు చేయాలంటే ముందు విచారణ చేయాలని అన్నారు. ఫార్ములా పేరుమీద మొత్తం రూ.600 కోట్లు దోచుకోవాలని కేటీఆర్ ప్రయత్నించారని అన్నారు. ప్రభుత్వం మారడంతో రూ.55 కోట్లతో ఆపినట్లు తెలిపారు.