Aish- Abhishek: విడాకుల రూమర్స్: ఆ వేడుకలో ఐశ్వర్య దంపతుల సందడి.. ఫొటోలు వైరల్

by Kavitha |
Aish- Abhishek: విడాకుల రూమర్స్: ఆ వేడుకలో ఐశ్వర్య దంపతుల సందడి.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్(Aishwarya Rai)- అభిషేక్ బచ్చన్‌(Abhishek Bachchan)ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సినిమాల్లో జంటగా నటించిన వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరాధ్య(Aaradhya) అనే పాప కూడా జన్మించింది. అయితే గత కొన్ని నెలలుగా ఐష్, అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ, దీనిపై ఇప్పటి వరకు ఈ జంట స్పందించలేదు. అయినప్పటికీ వీరి డివోర్స్ వార్తలు రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంది. ఈ క్రమంలో వీరిద్దరికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ముంబై ధీరుభాయ్ అంబానీ(Dhirubhai Ambani) స్కూల్ వార్షికోత్సవంలో బాలీవుడ్ తారలు సందడి చేశారు. అతిరథ మహారథులంతా ఈ కార్యక్రమానికి హాజరై నూతనోత్సహం తీసుకొచ్చారు.

ఇక ఈ కార్యక్రమానికి ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌ కలిసి అటెండ్ అవ్వడం ట్రెండింగ్‌గా మారింది. దంపతులిద్దరూ నవ్వుతూ.. హ్యాపీగా కనిపించారు. కుమార్తె ఆరాధ్య కూడా ఇదే స్కూల్‌లో చదువుతోంది. దీంతో ఆరాధ్య తాత అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), తల్లి ఐష్, తండ్రి అభిషేక్ హాజరు కావడం కొత్త కళ తీసుకొచ్చింది. ఈ ముగ్గురు కలిసే కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో ఈ ఫొటోలు కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఈ పిక్స్ చూసిన వారికి ఐష్- అభిషేక్ విడిపోలేదు ఇంకా కలిసే ఉన్నారంటూ ఓ క్లారిటీ వచ్చింది. కాగా వీరితో పాటు ఈ ఈవెంట్‌కి షారుఖ్ ఖాన్(Shahrukh Khan), గౌరీ ఖాన్(Gowri Khan) దంపతులు, కుమార్తె సుహానా ఖాన్(Suhana Khan), సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan), కరీనా కపూర్(Kareena Kapoor), కరిష్మా కపూర్(Karishma Kapoor) వంటి ప్రముఖులు హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed