TG Assembly: మరోసారి బీఆర్ఎస్ వాయిదా తీర్మానం.. అసెంబ్లీలో ఆ అంశంపై చర్చకు పట్టు

by Shiva |
TG Assembly: మరోసారి బీఆర్ఎస్ వాయిదా తీర్మానం.. అసెంబ్లీలో ఆ అంశంపై చర్చకు పట్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి బీఆర్ఎస్ (BRS) పార్టీ వాయిదా తీర్మానాన్ని అసెంబ్లీ సెక్రటరీకి అందజేసింది. ప్రపంచ స్థాయిలో తెలంగాణ (Telangana) ప్రతిష్టను పెంచే లక్ష్యంతో హైదరాబాద్ (Hyderabad) మహా నగరానికి ఫార్ములా ఈ-రేసు (Formula E-Race)ను తీసుకొచ్చామని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. మాజీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ (KTR)పై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ.. ఫార్ములా ఈ- కారు రేసింగ్ (Formula E- car racing) అంశంపై సభలో చర్చించాలని బీఆర్ఎస్ నేతలు తీర్మానంలో కోరుతూ చర్చకు పట్టబడుతున్నారు. ఈ క్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆ అంశంపై చర్చకు అనుతిస్తారా.. లేదో వేచి చూడాల్సిందే మరి.

Advertisement

Next Story

Most Viewed