- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ChatGPT:వాట్సాప్‌లో అందుబాటులోకి సరికొత్త ఫీచర్!
దిశ,వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వినియోగదారులను ఔరా అనిపిస్తుంది. ఇప్పుడు మరో సంస్థతో జత కట్టి మరో వినూత్న నిర్ణయం తీసుకుంది వాట్సాప్. అసలు విషయంలోకి వెళితే.. OpenAI ఒక కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా WhatsApp వినియోగదారులు నేరుగా ChatGPTతో ఇంటరాక్ట్ అయ్యేలా చేస్తుంది.
అసలు విషయంలోకి వెళితే.. ChatGPT సేవలను వాట్సాప్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు ఓపెన్ ఏఐ ప్రకటించింది. US, కెనడాలో 1-800-CHATGPT (1-800-242-8478) నెంబర్ ద్వారా ChatGPTతో కాల్స్/చాట్ చేయవచ్చని తెలిపింది. నెలకు 15 నిమిషాల పాటు ఫ్రీగా కాల్స్ మాట్లాడవచ్చని పేర్కొంది. అయితే ప్రజెంట్ కాల్స్ సదుపాయం యూఎస్, కెనడాకు మాత్రమే పరిమితం. ఇండియాలో ఉన్న వారు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి Chat GPT తో చాట్ చేయవచ్చు. వాట్సాప్ చాట్‌కు డైలీ లిమిట్ ఉంటుంది. ఈ క్రమంలో చాట్‌జీపీటీ సేవలు పొందాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. వాట్సప్‌లో అయితే ప్రత్యేకంగా అకౌంట్ అవసరం లేదు. అయితే రోజువారీ వినియోగం పై పరిమితి ఉంటుంది. అయితే పరిమితికి మించి వినియోగించినట్లయితే నోటిఫికేషన్ ద్వారా ఆ సమాచారం అందుతుంది.