Goods train:అరకు పర్యాటకులకు షాక్.. పట్టాలు తప్పిన రైలు

by Jakkula Mamatha |
Goods train:అరకు పర్యాటకులకు షాక్.. పట్టాలు తప్పిన రైలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలోని అల్లూరి జిల్లాలో (Alluri district)దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అల్లూరి జిల్లాలో గూడ్స్ రైలు(Goods train) పట్టాలు తప్పింది. అల్లూరి (Alluri district) జిల్లాలో భారీ వర్షాలకు కేకే లైన్‌లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అల్లూరి జిల్లాలో గూడ్స్ రైలు వాగన్ పట్టాలు తప్పింది. కొత్తవలస కిరండూల్ రైలు మార్గంలో ట్రాక్ పై బండరాళ్లు జారిపడ్డాయి.

ఈ నేపథ్యంలో విశాఖపట్నం(Visakhapatnam) నుంచి అరకు(Araku) వెళ్తున్న గూడ్స్ రైల్లో(Goods train) ఒక వాగన్ బొర్రా రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు వాగన్ పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన రైల్వే శాఖ అధికారులు(Railway officials) ట్రాక్ ను పునరుద్దించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. గూడ్స్ రైలు వాగన్ పట్టాలు తప్పడంతో.. విశాఖ -అరకు(Visakha - Araku) కిరండూల్ ప్యాసింజర్(Kirandul Passenger) రైలు రద్దు అయింది. దీంతో ఈరోజు అరకు పర్యటనకు వెళుతోన్న పర్యాటకులకు నిరాశ తప్పలేదు.

Advertisement

Next Story

Most Viewed