- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: అజ్ఞాతంలో మోహన్ బాబు.. దుబాయ్ వెళ్లినట్లు ప్రచారం !
దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు మోహన్ బాబు(Mohan Babu) కోసం హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీసులు(Hyderabad Pahad Sheriff Police) ముమ్మరంగా గాలిస్తు్న్నారు. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయన విచారించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మోహన్ బాబు మాత్రం అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే మోహన్ బాబు దుబాయ్ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కానీ మోహన్ బాబు లాయర్లు మాత్రం ఆ ప్రచారాలను ఖండించారు. మోహన్ బాబు దుబాయ్ వెళ్లలేదని, ఇండియాలోనే ఉన్నారని తెలిపారు.
కాగా మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. జల్ పల్లి ఫాంహౌస్‌లో మోహన్ బాబు, విష్ణు మధ్య గొడవలు జరిగాయి. అయితే న్యూస్ కవరేజ్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేశారు. లోగోను లాక్కుని మరీ బలంగా దాడి చేయడంతో జర్నలిస్టు తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సర్జరీ చేశారు. ప్రస్తుతం జర్నలిస్టు కోలుకుంటున్నారు.
అయితే జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్ బాబుపై పై కేసు నమోదు అయింది. ముందస్తు బెయిల్ కోరుతూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించిన మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మోహన్ బాబు పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో మోహన్ బాబును విచారించేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు దుబాయ్ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.