KTR : కేటీఆర్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-20 09:40:44.0  )
KTR : కేటీఆర్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
X

దిశ, వెబ్ డెస్క్ : ఫార్ములా ఈరేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) విచారణకు స్వీకరించింది. జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్‌లో వాదనలు మొదలయ్యాయి. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ దర్యాప్తుపై కూడా స్టే ఇవ్వాల్సిందిగా హైకోర్టును కేటీఆర్ కోరారు. రాజకీయ దురుద్దేశంతోనే నాపై కేసు పెట్టారని, ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చామని ఎఫ్ఐఆర్‌లో చెప్పారని.. కానీ ప్రైవేట్ సంస్థను నిందితుల జాబితాలో చేర్చలేదని కేటీఆర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఏసీబీతో పాటు ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్‌ను ప్రతివాదిగా చేర్చారు.

అగ్రిమెంట్‌కు ముందు నిధులు ఎఫ్‌ఈవో పంపడం ఉలంఘన కాదన్నారు. దీనికి ఐపీసీ 409 సెక్షన్ వర్తించదని తెలిపారు. 2023 అక్టోబర్ 30 రోజు చేసుకున్న అగ్రిమెంట్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదని కేటీఆర్ పిటిషన్ లో వివరించారు. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్‌కు ఇది కొనసాగింపు మాత్రమేనని, దీనికి పీసీ యాక్ట్‌కు సంబంధం లేదన్నారు. ఈ అగ్రిమెంట్ ద్వారా వ్యక్తిగతంగా తాను లాభపడినట్టు ఎక్కడా ఎఫ్‌ఐఆర్‌లో పొందపర్చలేదన్నారు. పొలిటికల్ మైలేజ్, రాజకీయంగా దెబ్బ తీసేందుకు కేస్ పెట్టారని తెలిపారు. చాలా సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీ నేతల అరెస్ట్‌లు ఉంటాయని బహిరంగగానే మంత్రి మాట్లాడారని.. ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్ చేసి ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే పలు సుప్రీం కోర్టు జడ్జిమెంట్‌లను పిటిషన్ కాపీలో కేటీఆర్ జతపరిచారు. మొత్తం మూడు సుప్రీం కోర్టు జడ్జిమెంట్‌లను కేటీఆర్ అటాచ్ చేశారు. యూపీకి చెందిన లలిత కుమార్, మహారాష్ట్రకు చెందిన చరణ్ సింగ్, ఏపీ రాష్ట్రానికి చెందిన రాఘవేందర్‌ కేసులలోని జడ్జిమెంట్‌ల కాపీలను కేటీఆర్ తన పిటిషన్‌కు జతచేశారు.

Advertisement

Next Story