అంగన్వాడీల పర్యవేక్షణ సూపర్వైజర్లు నిర్వహించాలి

by Naveena |
అంగన్వాడీల పర్యవేక్షణ సూపర్వైజర్లు నిర్వహించాలి
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: అంగన్వాడీ,పూర్వ ప్రాథమిక పాఠశాలలను మహిళ శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్లు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ మినీ సమావేశ మందిరంలో మహిళ శిశు సంక్షేమశాఖ సిడిపిఓ లు,సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంగన్వాడి కేంద్రాలను ప్రభుత్వం పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా మార్చినందున ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఆట,పాట లతో కూడిన విద్య,పౌష్టిక ఆహారం అందించాలని ఆమె సూచించారు. అంగన్వాడీ,పూర్వ ప్రాథమిక పాఠశాలలలో ఏ మండలంలో పనిచేస్తున్న సెక్టార్ ల పరిధిలో పని చేస్తున్న వారిని ఆయా మండలాల పరిధి లోని సెక్టార్ లలో పనిచేసేలా హేతుబద్దీకరణ చేయాలని సూచించారు. బరువు తక్కువ ఉన్న 5 సంవత్సరాల లోపు పిల్లల పట్ల అలసత్వం వహించకుండా గుర్తించి,ఎన్ఆర్సీ సెంటర్ కు పంపించాలని,సాధారణ బరువు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.

సూపర్వైజర్ లు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసే సమయంలో లోకేషన్ తో వచ్చే ఫోటోలను 'ఆప్' లో ఆప్లోడ్ చేయాలని సూచించారు. ఫీల్డ్ లో ఒక్క సూపర్వైజర్ కూడా ఎక్కడ కనిపించడం లేదని,గర్భిణుల ఇంటికి వెళ్లి వారి గురించి అడిగి తెలుసుకోవాలన్నారు. ఆప్ లో ఎప్పటికప్పుడు డేటా అప్లోడ్ చేయాలని సూచించారు. అంగన్వాడీ సెంటర్లో ఫ్యాన్లు,లైట్లు,టైమ్ టేబుల్,టాయిలెట్స్,పిల్లలకు యూనిఫాం వంటివి ఏర్పాటు చేయాలన్నారు. మండలానికి ఒక మోడల్ సెంటర్ గా ఏర్పాటు చేయాలని అన్నారు. అంగన్వాడీ,పూర్వ ప్రాథమిక పాఠశాలలో స్థలం ఉన్నచోట న్యూట్రీగార్డెన్ లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,జిల్లా సంక్షేమశాఖ అధికారిణి జరీనాబేగం,తదితరులు పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed