ఉపాధిహామీ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి

by Sridhar Babu |
ఉపాధిహామీ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి
X

దిశ, ఆదిలాబాద్ : జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరు, క్లస్టర్ల వారీగా పని దినాలు, చేపడుతున్న పనులు తదితర అంశాలపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జెడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి, డీఆర్డీఓ సాయన్న, ఎంపీడీఓలు, ఎంపీఓ, ఏపీడీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వనమహోత్సవం, మహిళా శక్తి ఉపాధి భరోసా, స్వచ్ఛభారత్ మిషన్, సోషల్ ఆడిట్ ల పై ఆన్ని మండలాల ఎంపీడీఓలను ఆయా మండలాల్లో సాధించిన లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. మండలాల పరిధిలో కిచెన్ గార్డెన్ కింద 95 ప్రభుత్వ పాఠశాలలో 13,527 కూరగాయల మొక్కలు నాటడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీలలో కిచెన్ గార్డెన్, న్యూట్రి గార్డెన్ కోసం స్థల సేకరణ చేయాలని సూచించారు.

అలాగే నర్సరీలలో ఈత, ఖర్జూర మొత్తం 468 జీపీ లలో 9 లక్షలు టార్గెట్ కాగా 5,04,500 మొక్కలు నాటామని, ఇంకా బ్యాలెన్స్ 3,95,500 , క్యాటిల్ షెడ్ వర్క్స్ 340 పనులకుగాను 232 పనులు మంజూరు కాగా 59 వర్క్ గ్రౌండ్ చేసినట్లు పేర్కొన్నారు. పొలంబాటలు (రోడ్స్ టూ అగ్రికల్చర్ ఫీల్డ్స్) వర్క్స్ టార్గెట్ 59.5 కాగా మంజురైనవి 200లలో 6 గ్రౌండింగ్, చెక్ డ్యామ్స్ పనులు టార్గెట్ 51 కాగా 85 మంజూరు చేయగా 5 గ్రౌండిగ్ తదితర అంశాలను తెలుసుకొని కూలంకుషంగా చర్చించారు. మిగిలిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో సాధించిన లక్ష్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇందులో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed