ED: మాజీ మంత్రి కేటీఆర్‌పై ఈడీ కేసు నమోదు

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-20 15:05:49.0  )
ED: మాజీ మంత్రి కేటీఆర్‌పై ఈడీ కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా-ఈ కార్ రేసు(Formula-E Car Race) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదైంది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్(ACB FIR) ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ.. ఈసీఐఆర్ నమోదు చేసింది. కేటీఆర్‌(KTR)తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిపైనా కేసు నమోదైంది.

మరోవైపు.. ఇవాళే కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. అటు ప్రభుత్వం, ఇటు కేటీఆర్ వైపు వాదనలు విన్న ధర్మాసనం.. ఈనెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. కేటీఆర్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. పది రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 27కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌పై ఈడీ కేసు నమోదు కావడం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed