సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యాయత్నం

by Sridhar Babu |   ( Updated:2024-12-20 16:33:36.0  )
సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యాయత్నం
X

దిశ,ఎల్లారెడ్డిపేట : తనని కులం నుంచి బహిష్కరించారని మనస్థాపం చెంది సెల్ఫీ వీడియో తీసుకుంటూ చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన ఎల్లారెడ్దిపేటలో చోటుచేసుకుంది. మృతుడు కొర్రి రమేష్ (45) పేర్కొన్న ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కొర్రి రమేష్ ను గత మూడు సంవత్సరాలుగా కుల సంఘం సభ్యులు మానసికంగా చిత్రహింసలు చేస్తూ కుల బహిష్కరణ చేశారు.

దాంతో శుక్రవారం ఆయన ఆవేదనతో జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్, సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐ రమాకాంత్ కు ఈ మేరకు తెలియజేస్తూ కుల సభ్యులైన కొత్త మల్లయ్య, లింగాల దాస్, లింగాల సన్నీ, లింగాల రామచంద్రం, కొత్త శ్రీనివాస్, కొత్త బాబు, బుర్క ధర్మేందర్, గడ్డం జితేందర్ లతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారని వారిని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేసి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed