బీజేపీలో చేరేది లేదు

by Shyam |
బీజేపీలో చేరేది లేదు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గట్టి పోటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక దశలో ఇద్దరి మధ్య ఓట్ల శాతం తక్కువగా ఉండటంతో.. తీన్మార్ మల్లన్న గెలిచే అవకాశాముందనే చర్చ జరిగింది. ప్రధాన పార్టీల అభ్యర్థులను కూడా అధిగమించి అత్యధిక ఓట్లను తీన్మార్ మల్లన్న గెలుచుకోవడంతో.. ఆయన బలం మరింత పెరిగిందని చెప్పవచ్చు.

ఎమ్మెల్సీ ఫలితాల్లో ఓడి గెలిచిన తీన్మార్ మల్లన్న రాజకీయంగా మరింత స్పీడ్ పెంచారు. గత కొద్దిరోజులుగా రాజకీయంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా మంత్రి ఈటలను కలిసినట్లు వస్తున్న వార్తలపై తీన్మార్ మల్లన్న స్పందించారు. ఈటెలను కలవాల్సిన అవసరం తనకు లేదని, ఈటలకు టీఆర్‌ఎస్‌లో అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు.

బీజేపీతో సహా ఏ పార్టీతో తాను చేరే ప్రసక్తే లేదని తీన్మార్ మల్లన్న తెలిపారు. బండి సంజయ్, తాను ఒకే కులమైతే ఏంటని, ఆయన సిద్దాంతాలు, తన సిద్దాంతాలు వేరని మల్లన్న చెప్పారు. తనపై కులముద్ర వేయవద్దని, తాను ఒక కులానికి చెందిన వ్యక్తిని కాదని తీన్మార్ మల్లన్న చెప్పారు.

Advertisement

Next Story