- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐఫోన్ స్పైవేర్ బారీన పడకుండా ఉండాలంటే ఇలా చేయండి
దిశ, టెక్నాలజీ: తాజాగా ఐఫోన్ యూజర్లకు హ్యాకింగ్ గురించిన స్పైవేర్ అలర్ట్‌లను యాపిల్ పంపిస్తున్న సంగతి తెలిసిందే. దీని వలన యూజర్ల డేటా మొత్తం కూడా ఇతరుల చేతికి వెళ్తుంది. ఫోన్‌లో ఉన్న వ్యక్తిగత డేటాను హ్యాకర్స్ చోరీ చేస్తారు. అయితే దీని బారీ నుండి రక్షించుకోవడానికి సైబర్ నిపుణులు ఐఫోన్లతో పాటు యాపిల్ ఉత్పత్తులను వాడే యూజర్లకు పలు ముందస్తు జాగ్రత్తలు సూచిస్తున్నారు. వీటి పాటించడం ద్వారా డివైజ్‌లను స్పైవేర్ దాడుల నుంచి రక్షించుకునే అవకాశం ఉంటుంది.
నిపుణులు సూచిస్తున్న సలహాలు ఇవే..
1. వెంటనే యూజర్లు తమ ఆపరేటింగ్ సిస్టంను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. యాపిల్ సెక్యూరిటీ అప్‌డేట్‌లను తరుచుగా విడుదల చేస్తుంది. యూజర్లు వీటిని ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా ఈ స్పైవేర్ నుంచి రక్షించుకోవచ్చు.
2. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయ్యాక ఫోన్‌లో ఏవైనా అనుమానస్పద యాప్‌లు ఉన్నట్లయితే వాటిని వెంటనే తొలగించాలి.
3. కొన్నిసార్లు, స్పైవేర్ మీ సిస్టమ్ పనులను యాక్సెస్ చేయడానికి, మీ డేటాపై గూఢచర్యం చేయడానికి కొత్త ప్రొఫైల్‌లను సృష్టించవచ్చు. కాబట్టి యూజర్లు సెట్టింగ్‌ల క్రింద, ప్రొఫైల్‌లు అండ్ డివైజ్ మెనేజ్‌మెంట్‌ను ఎంచుకుని మీ స్వంత ప్రొఫైల్ కాకుండా మరొక ప్రొఫైల్ కనిపిస్తే దానిని వెంటనే తీసివేయండి. ఇది స్పైవేర్ మీ పరికరాన్ని ట్యాంపరింగ్ చేయకుండా కాపాడుతుంది.
4. ఫోన్‌లో బ్రౌజింగ్ హిస్టరీని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి.
5. ఫోన్‌లో ఏదైనా అనుమానస్పద సమస్య వచ్చినట్టుగా గమనిస్తే వెంటనే ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. దీని వలన స్పైవేర్‌ను తొలగిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇలా చేస్తున్న సమయంలో మీ ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్‌లను కోల్పోతారు.
6. యాప్ స్టోర్‌లో నమ్మకమైన అధికారిక యాంటీవైరస్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఏవైనా స్పైవేర్ దాడులు జరిగినట్లయితే యాంటీవైరస్ వాటిని గుర్తించి అలర్ట్ చేస్తుంది.
7. ఫోన్‌కు ఏవైనా అనుమానస్పద లింక్‌లు వస్తే వాటిపై క్లిక్ చేయవద్దు.
ఐఫోన్ స్పైవేర్ బారీన పడినందని ఇలా గుర్తించండి..
1. అధిక డేటా వినియోగం
2. బ్యాటరీ లైఫ్ తగ్గిపోవడం
3. ఫోన్‌కు ప్రతినిమిషానికి వేడెక్కడం
4. ఫోన్ ఆపరేటింగ్ నెమ్మదించడం, యాప్‌లు స్లోగా ఓపెన్ కావడం
5. కాల్ మాట్లాడే సమయంలో నెమ్మదిగా బీప్ అనే సౌండ్ రావడం(కొన్ని స్పైవేర్ ఫోన్ కాల్‌లను రికార్డ్ చేయగలదు)
6. యాప్‌లు ఆటోమెటిక్‌గా ఓపెన్ అవడం.