- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భయపెడుతున్న ‘పార్సిల్ స్కామ్’... ఒక్కసారి వారి వలలో పడితే మీ డబ్బులన్ని గోవిందా..?
దిశ, ఫీచర్స్ : దేశంలో సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు కొత్త ట్రిక్కులతో ముందుకు దూసుకెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రజలను బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా పార్సిల్ స్కామ్ అనేది వెలుగులోకి వచ్చింది. దీంతో చాలా మంది కోట్లాది రూపాయలను పోగొట్టుకున్నారు. బాధితుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. పార్సిల్ స్కామ్ పేరుతో ప్రజలను బెదిరించి ఎలా డబ్బులు వసూలు చేస్తున్నారో ఇక్కడ చూద్దాం..
స్కామ్‌లో భాగంగా, స్కామర్ ఒక నంబర్‌ని ఉపయోగించి బాధితుడికి కాల్ చేస్తాడు. లేదా వాట్సాప్ వంటి సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అవ్వడానికి చూస్తారు. వారు వివిధ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీల ఉద్యోగులు అని చెబుతారు. బాధితురాలి పేరుపై మాదక ద్రవ్యాలు, నకిలీ పాస్‌పోర్ట్‌లు, ఇతర నిషిద్ధ వస్తువులతో కూడిన పార్సిల్స్ వచ్చాయని భయపెడతారు .ఇది నేను చేయలేదు అన్నా కూడా వారు వినరు. కొన్నిసార్లు బాధితుల బంధువులను అరెస్టు చేయడం భయాందోళనలకు గురిచేస్తుంది. పోలీస్ స్టేషన్ సెట్ లు వేసి బాధితులకి వీడియో కాల్స్ చేస్తుంటారు. వాటిని చూసిన తర్వాత, బాధితుడు ఇదంతా నిజమే అని నమ్ముతాడు. బాధితుడి భయపడిన తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తారు. ఆ కేసును వదిలేయాలంటే డబ్బులు ఇవ్వాలని కోరుతారు.
పార్సిల్ స్కామ్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని ప్రభుత్వం కోరింది. మీరు అలాంటి కాల్‌లు, వాట్సాప్ మెసేజ్‌లు , URLలను గుర్తిస్తే, మీరు సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కోరింది.