- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయోధ్యలో అతితక్కువ ధరకే అద్దె గదులు.. ఇలా బుక్ చేసుకోండి..
దిశ, ఫీచర్స్ : సుగుణాల రాముడు, దశరథ కుమారుడు అయోధ్యలో కొలువుదీరనున్నాడు. అధ్భుతమైన రామమందిర నిర్మాణం సుమారుగా పూర్తయ్యింది. జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు, యాత్రికులు అయోధ్యకు తరలిరానున్నారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ ఓ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా యాత్రికులు, భక్తులు వారికి కావలసిన వసతి కోసం గదులను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. మరి ఆ యాప్ వివరాలు ఏంటో తెలుసుకుందాం..
అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ వారు అందుబాటులోకి తీసుకువచ్చిన ‘హోలీ అయోధ్య’ యాప్ ద్వారా అతిధులు సులువుగా గదులు బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా రెసిడెన్షియల్ ప్రాపర్టీ అయిన హోమ్‌స్టేలలో అతి తక్కువ ధరలకు అద్దెకు గదులను పొందవచ్చు.
హోలీ అయోధ్య యాప్ బెనిఫిట్స్
హోమ్‌స్టే పథకం కింద 500 కన్న ఎక్కువ భవనాలు, 2200 గదులు రిజిస్టర్ అయ్యాయి. గదుల అద్దె కూడా కేవలం రూ.1000 నుంచి ప్రారంభమవుతాయి. యాప్ ద్వారా అయోధ్యకు తరలిన భక్తులు మధ్యవర్తుల చేతిలో మోసపోకుండా వారే స్వయంగా వారికి కావలసిన గదులకు బుక్ చేసుకోవచ్చు. హోమ్ స్టేలో గదులు తీసుకున్న యాత్రికులకు తోడుగా నగర నివాసితులు తోడుగా ఉంటారు.
హోలీ అయోధ్య యాప్ ఫీచర్లు
అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ తీసుకువచ్చిన యాప్ ను ఏడీఏ వెబ్‌సైట్ నుంచి లేదా గూగుల్ ప్లే స్టోర్ ద్వాకా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం యాప్ ఆండ్రాయిడ్ డివైజ్‌లలో అందుబాటులో ఉంది. యాప్ ద్వారా అందుబాటులో ఉన్న గదులను సింపుల్ గా చెక్ చేయవచ్చు. బడ్జెట్‌కు తగిన గుదులు సెలక్ట్ చేసుకోవచ్చు. ఇందులో హోమ్‌స్టే ఓనర్ల కాంటాక్ట్ డీటేల్స్ తో పాటు హోమ్‌స్టేల రేటింగ్స్, రివ్యూలు, ఫొటోలు, ఫెసిలిటీస్, లొకేషన్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో హోటల్స్, లాడ్జ్ లను కాకుండా కేవలం అయోధ్యలోని హోమ్‌స్టేల లిస్ట్స్ మాత్రమే చూపిస్తుంది.
యాప్ ద్వారా గుదులు బుక్ చేసుకోవాలి అనుకేంటే యూజర్లు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఈ-వాలెట్‌ల ద్వారా ఆన్‌లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. యూజర్లు తమ ఫోన్ నంబర్‌ను తెలిపి ముందుగా పూర్తిబకాయిని చెల్లించి హోమ్‌స్టేలో రూమ్ బుక్ చేసుకోవచ్చు. రూం నచ్చకపోతే క్యాన్సిలేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. చెక్-ఇన్ సమయానికి 24 గంటల ముందు క్యాన్సిల్ చేస్తే ఫుల్ రిఫండ్ పొందే అవకాశం ఉంది. 24 గంటలలోపు క్యాన్సిల్ చేస్తే డబ్బు రీఫండ్ అవ్వవు.