WhatsApp మెసేజ్‌లకు ChatGPT ద్వారా రిప్లై

by Harish |
WhatsApp మెసేజ్‌లకు ChatGPT ద్వారా రిప్లై
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు 'ChatGPT'. AI ఆధారంగా పనిచేస్తుంది. యూజర్ల ప్రశ్నలకు అత్యంత కచ్చితమైన సమాధానాలను అందిస్తుంది. ఇది ప్రారంభమైన కొద్ది నెలల్లోనే ఎంతో మంది వినియోగదారులను ఆకట్టుకుంది. ఇప్పటికే దీని పనితీరును చాలా మంది పరీక్షించారు. ఇటీవల ఎయిర్‌లైన్స్ కు ChatGPT ద్వారా ఈ మెయిల్ రాసి పంపారు. అలాగే ఆర్టిఫిషియల్‌గా పనిచేసే దీన్ని వివిధ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. చాట్‌ బాక్స్‌లో మనం రాసే బదులుగా ఈ యాప్ ద్వారా రాసే అవకాశం కూడా ఉంది. అయితే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో దీన్ని ఉపయోగించాలని చాలా మంది అనుకుంటున్నారు.

వాట్సాప్ చాట్‌లో వచ్చే మెసేజ్‌లకు సమాధానాలను ChatGPT ద్వారా రిప్లై ఇవ్వొచ్చు. యూజర్‌ వాట్సాప్‌ చాట్‌లో మెసేజ్‌కు రిప్లై ఇవ్వడానికి సమయం లేనప్పుడు ఈ యాప్ ద్వారా ఆటోమెటిక్‌గా రిప్లై ఇవ్వచ్చు. ప్రస్తుతానికి ChatGPTని ఇంటిగ్రేట్ చేయడానికి WhatsApp ఎటువంటి అధికారిక సపోర్ట్ ఇవ్వలేదు. కానీ వినియోగదారులు దీన్ని థర్డ్ పార్టీ ద్వారా వాడవచ్చు. ఈ మధ్య ఒక డెవలపర్ థర్డ్ పార్టీ ద్వారా ఈ ఆప్షన్‌ను తీసుకొచ్చారు. ఆ లింక్ https://github.com/danielgross/whatsapp-gpt.

ఈ లింక్‌‌ టెర్మినల్‌లో "Whatsapp-gpt-main" ఫైల్‌ను ఓపెన్ చేయాలి. తరువాత డౌన్‌లోడ్ జిప్ పై క్లిక్ చేసి, టెర్మినల్‌లో "server.py" ఫైల్‌ను రన్ చేయాలి. ls ఎంటర్ చేసి, python server.py" టైప్ చేయాలి. ఇప్పుడు మీ ఫోన్ నంబర్ OpenAI చాట్ పేజీకి కాన్ఫిగర్ చేయబడుతుంది. కానీ ఇది అధికారింగా ఎలాంటి అనుమతి పొందలేదు, కేవలం థర్డ్ యాప్ మాత్రమే.

Advertisement

Next Story