సరికొత్త ఫీచర్స్‌తో, బడ్జెట్ ధరలో లాంచ్ అయిన Realme కొత్త మోడల్

by Harish |   ( Updated:2022-08-26 14:22:06.0  )
సరికొత్త ఫీచర్స్‌తో, బడ్జెట్ ధరలో లాంచ్ అయిన Realme కొత్త మోడల్
X

దిశ, వెబ్‌డెస్క్: చైనీస్ కంపెనీ Realme కొత్త మోడల్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. కొత్త వేరియంట్ పేరు Realme 9i 5G. డైనమిక్ ర్యామ్ ఎక్స్‌పాన్షన్ టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్ వస్తుందని కంపెనీ పేర్కొంది. వింటేజ్ CD డిజైన్‌‌తో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. బేస్ వేరియంట్ 4GB RAM + 64GB స్టోరేజ్ ధర రూ.14,999. 6GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.16,999. కొనుగోలు సమయంలో HDFC బ్యాంకు ద్వారా రూ. 1000 తగ్గింపును అందిస్తుంది. Realme స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 24న మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకానికి రానుంది.




Realme 9i 5G స్పెసిఫికేషన్స్

- 6.6-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,400) డిస్‌ప్లే.

- 90Hz రిఫ్రెష్ రేట్, 400 nits బ్రైట్‌నెస్‌.

- Android 12 ఆధారంగా Realme UI 3.0పై రన్ అవుతుంది.

- 6GB RAM, ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 810 5G SoCని కలిగి ఉంది.

- మైక్రో SD కార్డు ద్వారా మెమరీని 1TB వరకు పెంచుకోవచ్చు.

- ఫోన్ బ్యాక్ సైడ్ 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది.

- ముందు వైపు సెల్ఫీల కోసం 8 MP కెమెరా ఉంది.

- 18W క్విక్ చార్జ్ టెక్నాలజీతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

- ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది.

ఇవి కూడా చదవండి : సూర్యరశ్మి ఆధారంగా కలర్ మారే సరికొత్త Vivo స్మార్ట్ ఫోన్




Advertisement

Next Story