Realme 13 5G: 80W చార్జింగ్‌, రెయిన్‌వాటర్ టచ్ ఫీచర్‌తో కొత్త మోడల్స్

by Harish |
Realme 13 5G: 80W చార్జింగ్‌, రెయిన్‌వాటర్ టచ్ ఫీచర్‌తో కొత్త మోడల్స్
X

దిశ, టెక్నాలజీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీ ఇండియాలో కొత్త మోడల్‌ సిరీస్‌ను విడుదల చేసింది. వీటి పేరు ‘Realme 13 5G’, ‘Realme 13+ 5G’. ఈ రెండు 80W చార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో మార్కెట్లోకి వచ్చాయి. రెండు ఫోన్‌లు రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌కు సపోర్ట్ ఇస్తాయి. దీంతో వినియోగదారులు వర్షంలో లేదా తడి చేతులతో ఫోన్‌లను ఉపయోగించవచ్చు. ప్రస్తుతానికి ఇవి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్ ద్వారా ముందస్తు బుకింగ్‌ కోసం అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 6న నేరుగా అమ్మకానికి వస్తాయి. ప్రీ-ఆర్డర్ చేసే కస్టమర్‌లు 6 నెలల పాటు ఉచిత స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ పొందవచ్చు. ఇంకా రూ.1500 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఉంటుంది.

Realme 13 5G: ఈ ఫోన్‌లో 6.72-అంగుళాల పూర్తి-HD+ LCD (1,080 x 2,400 పిక్సెల్‌లు) డిస్‌ప్లే ఉంది. రిఫ్రెష్ రేట్ 120hz. ఇది ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 6300 5G చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. Android 14-ఆధారిత Realme UI 5.0తో రన్ అవుతుంది. ఫోన్ బ్యాక్‌సైడ్ 50MP శామ్‌సంగ్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌లు ఉన్నాయి. ముందు సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది. ఫోన్ నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం IP64-రేటింగ్‌తో వచ్చింది. 8GB RAM + 128GB వేరియంట్ ధర రూ.17,999, 8GB RAM + 256GB ధర రూ. 19,999.

Realme 13+ 5G: ఈ ఫోన్ 6.67-అంగుళాల పూర్తి-HD+ (1,080 x 2,400 పిక్సెల్‌లు) OLED "Esports" డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz. ఇది ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G SoC ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత Realme UI 5.0తో రన్ అవుతుంది. ఫోన్ బ్యాక్‌సైడ్ 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌లు ఉన్నాయి. ముందు సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది. ఈ ఫోన్ కూడా IP64-రేటింగ్‌తో వచ్చింది. 8GB RAM + 128GB వేరియంట్ ధర రూ.22,999, 8GB RAM + 256GB ధర రూ.24,999, 12GB RAM+ 256GB ధర రూ.26,999.

Advertisement

Next Story

Most Viewed