- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టెలిగ్రామ్‌లో కొత్తగా గ్రీటింగ్ మెసేజ్, క్విక్ రిప్లైస్ ఫీచర్స్
దిశ, టెక్నాలజీ: ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ తన వినియోగదారుల కోసం పలు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. కంపెనీలు, వారి కస్టమర్ల మధ్య కమ్యూనికేషన్‌ను పెంచడానికి గ్రీటింగ్ మెసేజ్‌లు, వేగవంతంగా సమాధానాలు ఇచ్చుకోడానికి క్విక్ రిప్లైస్, ఇంకా మరిన్ని ఆప్షన్లను విడుదల చేసింది. కొత్త ఫీచర్లు ప్రస్తుతం ప్రీమియం వినియోగదారులందరికీ ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. గ్రీటింగ్ మెసేజ్‌ల ద్వారా వ్యాపారులు తమ చానెల్‌కు మొదటిసారిగా కనెక్ట్ అయిన వారికి శుభాకాంక్షల మెసేజ్‌లను పంపవచ్చు, దీనిని ఆటోమెటిక్‌గా పంపించవచ్చు. అలాగే, క్విక్ రిప్లైస్ ఫీచర్ ప్రీసెట్ రిప్లై చాట్‌ను అందిస్తుంది. అలాగే, వినియోగదారులు తమ వ్యక్తిగత టెలిగ్రామ్ ఖాతాలను బిజినెస్ ఖాతాలుగా మార్చుకోవచ్చు. వీటితో పాటు మరిన్ని కొత్త ఫీచర్లను కంపెనీ విడుదల చేసింది. టెలిగ్రామ్ CEO, వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త ఆప్షన్లను అందించాము. ఇవి కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తాయని అన్నారు.