- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీ బ్యాటరీతో మరికొద్ది రోజుల్లో మార్కెట్లోకి Infinix కొత్త స్మార్ట్ ఫోన్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ కంపెనీ Infinix నుంచి కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి రానుంది. ఈ వేరియంట్ పేరు ‘Infinix Smart 7’. ఇది ఏప్రిల్ 28న లాంచ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. దీనికి సంబంధించిన కొన్నిఫీచర్స్ విడుదల అయ్యాయి. అంచనాల ప్రకారం , స్మార్ట్ ఫోన్ 6.6-అంగుళాల IPS LCD HD+ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. Unisoc SC9863A1 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. అలాగే, XOS 12 స్కిన్‌తో Android 12 ద్వారా రన్ అవుతుందని అంచనా.
Infinix Smart 7లో బ్యాక్ సైడ్ 13MP ప్రైమరీ AI సెన్సార్, 2MP సెకండరీ సెన్సార్‌తో పాటు డ్యూయల్ LED ఫ్లాష్ యూనిట్ ఉన్నాయి. ముందు 5MP సెల్ఫీ కెమెరా ఉండనుంది. గరిష్టంగా 4GB RAM, 64GB మెమరీ ఉంటుంది. 10W చార్జింగ్ సపోర్ట్‌తో 'ఫస్ట్-ఇన్-సెగ్మెంట్' పెద్ద 6,000mAh బ్యాటరీని కూడా అందించారు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో పాటు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉంది. ధర, ఇతర పూర్తి వివరాలు లాంచ్ టైంలో కంపెనీ పేర్కొననుంది.