iphone 16: ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 9న కొత్త ఫోన్ల విడుదల

by Prasanna |
iphone 16: ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 9న కొత్త ఫోన్ల విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: మార్కెట్లో ఎన్ని ఫోన్లు ఉన్నా .. యాపిల్ ఫోన్ క్రేజే వేరు. ఈ ఐఫోన్లకు ప్రజల్లో మంచి ఆదరణ ఉండటంతో వారి కోసం కొత్త కొత్త ఫోన్లను తీసుకొస్తుంది. ఆ కంపెనీ రిలీజ్ చేసే లేటెస్ట్ మోడల్ కోసం చాలా మంది ఎదురుచూస్తుంటారు. కొందరికైతే ఐఫోన్ ను కొనుగోలు చేయడమే లక్యంగా పెట్టుకుంటారు. వీటి ధర ఎక్కువగానే ఉన్నప్పటికీ స్పెసిఫికేషన్లు, ఫీచర్స్ స్పెషల్ గా ఉంటాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 9న జరిగే “ఇట్స్ గ్లోటైమ్” ఈవెంట్ లో ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేయనున్నారు. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మాక్స్ ను రిలీజ్ చేయనున్నాయి.

ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ అంతకముందు ఉన్న మోడల్ మాదిరిగానే ఉంటాయి. డిస్ ప్లే 6.1, 6.7 అంగుళాలు ఉంటుంది. ఐఫోన్ 15 ప్రో సిరీస్ కు యాక్షన్ బటన్ ఉంది. కానీ ఐఫోన్ 16 మోడళ్లలో మ్యూట్ స్విచ్‌ ఉంటుంది. ఫ్లాష్‌లైట్‌, కెమెరా ఆపరేట్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.

నెక్ట్ జనరేషన్ కు చెందిన A18 చిప్ ను ఐఫోన్ 16 మోడళ్ల లో వాడనున్నారు. అలాగే ర్యామ్‌ ను 6 GB నుంచి 8 GB వరకు విస్తరించారు. ప్రో మోడళ్లు wifi 7ని పొందగలిగినప్పటికీ, iphone 16 వేరియంట్లు wifi 6ఈకి అప్‌గ్రేడ్ అవుతాయని చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed