మరో రెండు రోజుల్లో ఆగిపోనున్న శాటిలైట్స్, స్పేస్ స్టేషన్స్!

by M.Rajitha |
మరో రెండు రోజుల్లో ఆగిపోనున్న శాటిలైట్స్, స్పేస్ స్టేషన్స్!
X

దిశ, వెబ్ డెస్క్ : మరో రెండు రోజుల్లో భూగోళం ఓ ముప్పును ఎదుర్కోబోతుంది. రాగల రెండు రోజుల్లో భూమి మీద గల పవర్ గ్రిడ్, శాటిలైట్స్, స్పేస్ స్టేషన్లు స్తంభించి పోనున్నాయి. ఇంతకీ ఏం జరుగనుంది... సూర్యుని నుండి ఆగస్టు 7,8 తేదీల్లో వెలువడిన మూడు అత్యంత శక్తివంతమైన సౌర తుఫాన్లు మరో రెండు రోజుల్లో భూమిని ఢీకొట్టబోతున్నాయి. ఈ సౌర తుఫాన్లను సాంకేతిక భాషలో కరోనల్ మాస్ ఎజెక్షన్స్(CME) అంటారు. CME అనేది సూర్యుని కరోనపై పెరుగుతున్న సౌరగాలి, అయస్కాంత క్షేత్రాల భారీ విస్పోటనం వల్ల ఏర్పడుతుంది. ఈ విస్పోటనాలు బిలియన్ల టన్నుల ప్లాస్మాను అంతరిక్షంలోకి విడుదల చేస్తాయి. ఈ ప్లాస్మా వల్ల భూమి మాగ్నటోస్పియర్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ మాగ్నటోస్పియర్ పొరలోనే ఉన్న భూమి యొక్క కమ్యూనికేషన్, శాటిలైట్స్, పవర్ గ్రిడ్ మరియు స్పేస్ స్టేషన్లు ఎక్కడిక్కడ స్తంభించి పోతాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కాని సాంకేతిక మౌలిక వసతుల విషయంలో ప్రపంచం ముందుగానే సన్నద్ధంగా ఉండాలని అంటున్నారు. ఈ మూడు సౌర తుఫాన్లు సెకనుకు వెయ్యి కి.మీల వేగంతో ప్రయాణిస్తున్నాయని, ఆగస్ట్ 7,8 న ఇవి విడుదలైనప్పటికీ భూమిని చేరడానికి ఇంకో రెండు రోజులు పడుతుందని అంటున్నారు. ముఖ్యంగా3వ తుఫాను తీవ్రత అత్యంత శక్తిమంతంగా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు.

Next Story