AP TET:ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు రంగం సిద్ధం

by Jakkula Mamatha |
AP TET:ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు రంగం సిద్ధం
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో TET (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షలకు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 3 నుంచి 21 వరకు రాష్ట్రంలో టెట్ పరీక్షలు(TET Exams) నిర్వహించనున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. దసరా పండుగ(Dussehra festival) నేపథ్యంలో అక్టోబర్ 11, 12 తేదీల్లో మినహా మిగతా తేదీల్లో టెట్ పరీక్షలు ఉంటాయని తెలిపింది. ఈ క్రమంలో టెట్ పరీక్షకు 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. సెప్టెంబర్ 22 నుంచి టెట్ అభ్యర్థులకు హాల్ టికెట్లు(Hall tickets) జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. టెట్ పరీక్షకు(TET Exam) హాజరయ్యే కొందరు అభ్యర్థులకు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎగ్జామ్ సెంటర్లు కేటాయించడం గందరగోళానికి గురి చేసింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు. ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్న అభ్యర్థులకు ఒకే ప్రాంతంలో ఎగ్జామ్ సెంటర్ కేటాయిస్తూ ఆన్‌లైన్‌లో హాల్ టిక్కెట్లు పొందుపర్చారు.

Next Story

Most Viewed