‘లడ్డూ కావాలా నాయనా’ మీమ్ పై కోలీవుడ్ స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

by Jakkula Mamatha |   ( Updated:2024-09-24 15:38:01.0  )
‘లడ్డూ కావాలా నాయనా’ మీమ్ పై కోలీవుడ్ స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ‘సత్యం సుందరం’ సినిమా సెప్టెంబర్ 28న రానుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో(Hyderabad) సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre release event) నిర్వహించారు. ఈ నేపథ్యంలో కార్తీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సత్యం సుందరం’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో భాగంగా ‘లడ్డూ కావాలా నాయనా’ అనే మీమ్ పై నటుడు కార్తీ చాకచక్యంగా స్పందించారు. ఇప్పుడు లడ్డూ గురించి వద్దు. ఆ టాపిక్ చాలా సెన్సిటివ్ అని నవ్వుతూ దాని పై మాట్లాడేందుకు తిరస్కరించారు. అటు తిరుమల లడ్డూ(Tirumala Laddu) వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే తిరుమల లడ్డూను ఉద్దేశంలో పెట్టుకునే కార్తీ ఈ కామెంట్స్ చేసి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజెంట్ సోషల్ మీడియాలో హీరో కార్తీ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.


Read More...

డిప్యూటీ CM పవన్ కల్యాణ్ సీరియస్.. క్షమాపణలు చెప్పిన హీరో కార్తీ

Advertisement

Next Story