Viral Video : నడి సంద్రంలో అలల హోరు.. సుడిగుండాలు దాటుతూ వెళ్తుండగా..

by Javid Pasha |
Viral Video : నడి సంద్రంలో అలల హోరు.. సుడిగుండాలు దాటుతూ వెళ్తుండగా..
X

దిశ, ఫీచర్స్ : ప్రకృతిలో అందమైన ప్రదేశాలు, అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. పరిశోధకులు పలు అంశాలను ఛేదించినప్పటికీ తెలియనివి కూడా ఇంకెన్నో ఉంటున్నాయి. అలాంటి వాటిలో సముద్రాలు కూడా ఒక్కటి. వీటి గురించి మానవులకు చాలా విషయాలు తెలుసు. అయినా అప్పుడప్పుడూ ఏర్పడే తుఫానులు, సుడిగుండాలు కొత్త సవాళ్లను విసురుతూనే ఉన్నాయి. ఆధునిక పడవలు, జలాంతర్గాములు అందుబాటులో ఉన్నప్పటికీ సముద్రయానం ఎల్లప్పుడూ సరదాగా ఉండదు. అనేక సందర్భాల్లో అదొక భయానక అనుభవంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వైరల్ వీడియో సమాచారం ప్రకారం.. నడి సంద్రంలో.. అలల హోరు మధ్య, ఎగసి పడుతున్న కెరటాలు చుట్టు ముడుతూ ఉండగా ఓ భారీ ఓడ ముందుకు దూసుకెళ్తోంది. ఈ సమయంలో సుడులు తిరుగుతున్న నీటి వలయాల పీడనానికి, రాకాసి అలల ధాటికి అక్కడ భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఒక్కోసారి నీళ్లు‌పైకి ఎగసి పడుతూ ఓడలోకి చేరుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే.. అక్కడ ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అనిపిస్తుంది. ఏ క్షణంలో ఏ రాకాసి అలవచ్చి ఓడను మింగేస్తుందో కూడా చెప్పలేం. ఇక అందులో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది ఎలా ఫీలవుతున్నారో తెలియదు కానీ.. ఈ దృశ్యాన్ని చూస్తుంటే మాత్రం వారు ప్రాణాలు అరచేతబట్టుకొని ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ‘ఇంతటి భయానక వాతావరణంలో ఓడలు, అందులోని సిబ్బంది ఎలా తట్టుకొని నిలబడతారో నాకైతే ఆశ్చర్యంగా ఉంది’ అనే క్యాప్షన్‌తో ఓ యూజర్ దీనిని ఎక్స్ వేదికలో పోస్ట్ చేయగా సముద్రం చాలా భయంకరమైందని కొందరు, నేచర్ చాలా అద్భుతమైంది.. అపురూపమైంది అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

Read More : https://x.com/AMAZlNGNATURE/status/1837061628056998185

Next Story

Most Viewed