జెలెన్‌స్కీతో ప్రధానీ మోడీ భేటీ

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-09-24 06:47:42.0  )
జెలెన్‌స్కీతో ప్రధానీ మోడీ భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా ప‌ర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్‌స్కీని కలిశారు. ద్వైపాక్షిక చ‌ర్చల్లో భాగంగావారిద్దరూ న్యూయార్క్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ లో శాంతి స్థాపనకు భారత్ మద్దతును మోదీ పునరుద్ఘాటించారు. నెల రోజుల వ్యవధిలో జెలెన్ స్కీ, మోడీల మధ్య ఇది రెండో భేటీ కావడం గమనార్హం.

ఆగ‌స్టు 23వ తేదీన ఉక్రెయిన్‌ పర్యటనలో భాగంగా జెలెన్ స్కీతో సమావేశమైన మోడీ ర‌ష్యాతో జ‌రుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు, శాంతి స్థాపనకు చోరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. తాజాగా న్యూయార్క్‌లో జ‌రుగుతున్న స‌మ్మిట్ ఆఫ్ ద ఫ్యూచ‌ర్ మీటింగ్‌లో క‌లిశారు. తమ సమావేశంపై ఇరుదేశాధినేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. మేము ఇరుదేశాల సంబంధాలను చురుకుగా అభివృద్ధి చేస్తున్నామని, వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి కలిసి పనిచేస్తున్నామని మోడీ వెల్లడించారు. ఉక్రెయిన్ లో శాంతిస్థాపన అమలుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. శాశ్వతమైన, శాంతియుతమైన పరిష్కార సాధనకు భారత్ అన్ని మార్గాల్లో సిద్ధంగా ఉందన్నారు. జెలెన్ స్కీ స్పందిస్తూ యూఎన్ జీ20 సదస్సులలో శాంతి సూత్రాన్ని అమలుచేయడం, రెండో శాంతి శిఖరాగ్ర సమావేశం వంటి పలు అంశాలపై చర్చించామని తెలిపారు. అలాగే సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు స్పష్టమైన మద్దతు ఇచ్చినందుకు ఈ సందర్భంగా మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed